సుదర్శన్ ఇలా ఔటయ్యాడేమిటి?
- ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్ర ఔట్
- చేతి నుంచి జారిన బ్యాట్‌తో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన వైనం
- షాట్ ఆడే క్రమంలో చేతి నుంచి జారిన బ్యాట్ వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసిన వైనం
- సుదర్శన్ ఔట్ తాలూకు వీడియో నెట్టింట వైరల్
ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ అత్యంత విచిత్రమైన రీతిలో హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత విచిత్రమైన ఔట్లలో ఒకటిగా నిలిచిపోయింది.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ వేసిన బంతిని సుదర్శన్ కట్ షాట్ ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, షాట్ ఆడే క్రమంలో అతని చేతి నుంచి బ్యాట్ జారిపోయింది. సుదర్శన్ పరుగు తీస్తుండగా గాల్లోకి లేచిన బ్యాట్ వెనక్కి వచ్చి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు అతడిని హిట్‌వికెట్‌గా ప్రకటించారు. ఈ ఊహించని పరిణామానికి క్రీడాకారులు, అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.
ఈ విచిత్రమైన ఔట్ తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయి, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో తమ చెత్త రికార్డును నమోదు చేసింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, కెప్టెన్ రజత్ పటిదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. పటిదార్ 93 పరుగులతో అజేయంగా నిలవడంతో ఆర్సీబీ 254/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను గుజరాత్ జారవిడచగా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.